బూస్టర్‌ డోస్‌గా ఇన్‌కొవాక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌ ?

Telugu Lo Computer
0


భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా ‘ఇన్‌కొవాక్‌’ను బూస్టర్‌ డోస్‌గా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అనుమతి ప్రకారం ఇప్పటివరకు రెండు డోసుల కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారు 6నెలల తర్వాత బూస్టర్‌ డోస్‌గా ఈ చుక్కల మందు టీకా తీసుకోవచ్చు. చుక్కల మందు టీకాను (నాసల్‌ వ్యాక్సిన్‌) ‘బూస్టర్‌ డోసు’ కింద వినియోగించేందుకు అవసరమైన క్లినికల్‌ పరీక్షల నిర్వహణ అనుమతి అంశాన్ని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ  పరిశీలిస్తోంది. ఇందుకోసం మంగళవారం సమావేశమై చర్చించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి ‘బూస్టర్‌ డోసు’ కింద ఈ చుక్కల మందు టీకా అనువైనదని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. దీన్ని 'ఫైవ్‌ ఆర్మ్స్‌' బూస్టర్‌ డోసుగా వ్యవహరిస్తారు. ఈ టీకాను భారత్‌ బయోటెక్‌, అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ- సెయింట్ లూయిస్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. మనదేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ టీకా వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)