నా భార్య నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 21 November 2022

నా భార్య నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది !


మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉమంగ్‌ సింఘార్‌ పై గృహహింస, అత్యాచారం, బెదిరింపులు వంటి క్రిమినల్‌ ఆరోపణలున్నాయి. ఉమంగ్‌ భార్య తన ఇంటి సహాయకురాలి భర్త పేరుతో కూడా ఆస్తులు కలిగి ఉన్నారని, అలాగే ఆయన సహజీవనం చేసిన సోనియా భరద్వాజ్‌ ఆత్మహత్యలో కూడా ఉమర్‌ ప్రమేయం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై నౌగోన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఆ ఆరోపణలన్నింటిని  ఉమంగ్‌ ఖండించారు. తన భార్య తనను బ్లాక్‌మెయిల్‌​ చేస్తోందని చెప్పారు. తనను మానసికంగా వేధించి, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నందుకు నవంబర్‌2న ఆమెపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. అంతేగాక తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి రూ. 10 కోట్లు డిమాండ్‌ చేసిందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్‌ కూడా ఆ ఆరోపణలకు బలం చేకూరేలా ఉమాంగ్‌కు గతంలో కొంతమంది భార్యలు ఉన్నారని అన్నారు. అయితే ఉమంగ్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శక్తివంతమైన గిరిజన నాయకుడు. పైగా మాజీ ముఖ్యమంత్రి జమునాదేవి మేనల్లుడు కూడా. గత కమల్‌ నాథ్‌ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన ఉమంగ్‌ ప్రస్తుతం గంద్వాని స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

No comments:

Post a Comment