సిలిండర్ లో గ్యాస్ గడ్డ కడుతుందా ?

Telugu Lo Computer
0


చలి కారణంగా ఇంట్లోని ద్రవ పదార్థాలన్నీ గడ్డకడుతుంటాయి. ఎల్‌పీజీ గ్యాస్ కూడా గడ్డకడుతుంటుంది. గ్యాస్ అలా గడ్డకట్టడం వల్ల అది త్వరగా అయిపోతుందని అంటారు. నేల చల్లబడటం, చుట్టూ ఉన్న వాతావరణం చల్లబడటం కారణంగా సిలిండర్‌లోని గ్యాస్ గడ్డ కడుతుంది. దీని కారణంగా గ్యాస్ గడ్డకట్టకుండా ఉండాలంటే సిలిండర్ ట్రాలీని ఉపయోగించవచ్చు. సిలిండర్ వీల్‌ని ఉపయోగించడం వల్ల ఫ్లోర్ వాతావరణం ఎఫెక్ట్ సిలిండర్‌కు ఉండదు. ఫలితంగా గ్యాస్ గడ్డకట్టకుండా ఉంటుంది. గ్యాస్ గడ్డకుండా ఉండటానికి జనపనార సంచిని ఉపయోగించవచ్చు. సిలిండర్ కింద జనపనార సంచిని ఉంచవచ్చు. అంతేకాకుండా.. జనపనార సంచితో ఆ సిలిండర్‌ను పూర్తిగా కవర్ చేయొచ్చు. ఒక పెద్ద గిన్నెలో 3 నుంచి 4 లీటర్ల వేడి నీటిని నింపాలి. సిలిండర్‌ను ఆ నీటిలో పెట్టాలి. ఒకవేళ మీ గ్యాస్ గడ్డగట్టినట్లు అనిపిస్తే.. వేడి నీటిలో పెట్టడం వలన అది మామూలు స్థితికి వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)