కిరెన్ రిజిజు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 28 November 2022

కిరెన్ రిజిజు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం !


కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఇవాళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ టీవీ చర్చా వేదికలో సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదన్న ఆయన అభిప్రాయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది అత్యున్నత న్యాయస్థానం. అలా జరిగి ఉండకూదని బెంచ్‌ వ్యాఖ్యానించింది. కొలీజియం ప్రతిపాదిత పేర్ల ఆమోద జాప్యానికి సంబంధించిన దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంలో అత్యున్నత న్యాయవ్యవస్థలో నియామకాలను కేంద్రం ఆలస్యం చేస్తోందని ధ్వజమెత్తింది. కొలీజియంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజయ్‌ కృష్ణన్‌ కౌల్‌, జస్టిస్‌ ఏఎస్‌ ఒకా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ ''ఒకరు ఉన్నతస్థాయిలోఉన్నప్పుడు అలా జరిగి ఉండకూడదు అని పేర్కొంది. అయితే ఆ సమయంలో కేంద్రం తరపున సాలిసిటర్‌ జనరల్‌.. ''కొన్నిసార్లు మీడియా తప్పుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయ'ని వ్యాఖ్యానించారు. వెంటనే ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ను ఉద్దేశిస్తూ జస్టిస్‌ కౌల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మిస్టర్‌ అటార్నీ జనరల్‌ నేను కూడా మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోను. కానీ, ఈ వ్యాఖ్యలు చాలా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి అదీ ఓ ఇంటర్వ్యూలో వచ్చాయి. ఇంతకంటే ఏం చెప్పలేను. అవసరమైతే నిర్ణయం తీసుకుంటాం అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇక న్యాయశాఖ నియామకాల్లో జాప్యంపై, జాతీయ న్యాయ నియామకాల కమిషన్  మస్టర్‌ను ఆమోదించకపోవడమే ప్రభుత్వం సంతోషంగా లేకపోవడానికి కారణమా, అందుకే పేర్లను క్లియర్ చేయలేదా? అని కోర్టు సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించింది. కొలీజియం సిఫార్సులపై ప్రభుత్వం సిట్టింగ్‌పై సుప్రీంకోర్టు తన రిజర్వేషన్లను పేర్కొనకుండా పేర్లను వెనక్కి తీసుకోదంటూ చెబుతూ.. న్యాయపరమైన నిర్ణయం తీసుకుంటామని కేంద్రాన్ని హెచ్చరించింది. దయచేసి త్వరగతిన పరిష్కరించండి. ఈ విషయంలో మమ్మల్ని న్యాయపరమైన నిర్ణయం తీసుకునేలా చేయొద్దు అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్ల జాప్యంపై.. కోర్టు మనోభావాలను కేంద్రానికి తెలియజేయాలంటూ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌లను కోర్టు కోరింది. ఈ అంశాన్ని పరిశీలిస్తామని అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ కోర్టుకు హామీ ఇవ్వడంతో డిసెంబర్ 8కి కేసు విచారణను వాయిదా వేశారు. 

No comments:

Post a Comment