హోదా, విభజన హామీల అమలుకై ఢిల్లీలో ఆందోళన - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 26 November 2022

హోదా, విభజన హామీల అమలుకై ఢిల్లీలో ఆందోళన


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేడు ప్రత్యేక హోదా సాధనా సమితి, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర మంతర్లో ఆందోళన నిర్వహించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సదాశివరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేత లక్ష్మీనరసింహ యాదవ్, రాజ్యసభ ఎంపి బినయ్ విశ్వం ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన హక్కుల విషయంలో హామీల విషయంలో జరుగుతున్న తీవ్ర అన్యాయానికి నిరసనగా విద్యార్థి, యువజన మహాధర్నా ఢిల్లీలో జంతర్ మంతర్ లో జరిగింది.

No comments:

Post a Comment