ఒకే ఒక్క దోమకాటు వల్ల రెండు రకాలు జ్వరాలు !

Telugu Lo Computer
0


పంజాబ్ లోని చండీఘడ్ డెంగీ, చికున్ గున్యా జ్వరాలతో వణుకుతోంది. ఏడెస్ ఈజిప్టి దోమ కాటు వల్ల డెంగీ, చికున్ గున్యా జ్వరాలు ప్రబలుతున్నాయని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వైరాలజీ విభాగం వైద్యులు చెప్పారు. ఇప్పటికే చండీఘడ్ లో 101 చికున్ గున్యా కేసులు, 839 డెంగీ జ్వరాల కేసులు నమోదయ్యాయి.ఈ సీజనులో ఏడెస్ దోమల కాటు వల్ల డెంగీ, చికున్ గున్యా జ్వరాలు వస్తున్నాయని వైరాలజీ విభాగం అధిపతి రాధా కాంత రాథో చెప్పారు. ఒకే ఒక్క దోమకాటు వల్ల రెండు రకాలు జ్వరాలు ప్రబలుతున్నాయని తాము జరిపిన పరిశోధనలో తేలిందని వైద్యనిపుణులు చెప్పారు. ఏడెస్ దోమల బెడద పగటిపూట ఎక్కువగా ఉంటుందని, ఈ దోమ సాధారణంగా పగటిపూట కుడుతుందని వైద్యులు చెప్పారు. డెంగీ, చికున్‌గున్యా వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల హై గ్రేడ్ జ్వరం, తలనొప్పి, వికారం, దద్దుర్లు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని, దీనివల్ల ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)