గుజరాత్‌ ఎన్నికల్లో డిజిటల్‌ వార్‌!

Telugu Lo Computer
0


గుజరాత్‌ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సోషల్‌ మీడియా వేదికగా వినూత్న ప్రచారం చేపట్టాయి. ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్ర నినాదాలు పోస్టు చేస్తున్నాయి. వేల మంది కార్యకర్తలు, వలంటీర్లు ఈ ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. నిజానికి బీజేపీ ఆరు నెలల ముందే డిజిటల్‌ ప్రచారం మొదలుపెట్టింది. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆ పార్టీకి పెద్దసంఖ్యలో ఫాలోయర్లు ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్వారా ప్రచారం హోరెత్తిస్తోంది. కాంగ్రెస్‌, ఆప్‌ ఎక్కువగా వాట్సా్‌పపై ఆధారపడ్డాయి. దీనిద్వారా క్షేత్ర స్థాయిలో ఓటర్లకు చేరువయ్యేందుకు కృషిచేస్తున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)