చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 20 November 2022

చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు !


గోవాలో ఇఫీ చలనచిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు పురస్కారాలు అందిస్తున్నారు.  చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022గా ప్రకటిస్తూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి విశేష ప్రజాదరణ పొందారని, హృదయాలను కదిలించే నటనాప్రతిభ ఆయన సొంతమని కొనియాడుతూ చిరంజీవికి అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు ఈ గౌరవం ఇవ్వడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి మరియు తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చిరంజీవి వివరించారు.

1 comment:

  1. అంతొ బాగానే ఉంది కాని 2022లో చిరంజీవి సినీరంగంలో అందరిని త్రోసి రాజు అని సాధించినది ఇటబ్బా?

    ReplyDelete