దేవాలయాలకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి !

Telugu Lo Computer
0


బీహార్ లో రిజిస్టర్ కాని దాదాపు 4,000 దేవాలయాలు, మఠాలు, ట్రస్టులను మూడు నెలల్లోగా నమోదు చేయాలని రాష్ట్రంలోని 38 జిల్లాల అధికారులను కోరిందని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు, మఠాల పూజారులు భూములను బదిలీ చేయడం లేదా విక్రయించడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు. రిజిస్టర్డ్ దేవాలయాలు, మఠాల భూమి ఆక్రమణకు గురికాకుండా నిరోధించడానికి బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నమోదిత దేవాలయాలకు ఫెన్సింగ్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది. బీహార్‌లోని అన్ని ప్రభుత్వ దేవాలయాలు,మఠాలు, ట్రస్టులు మరియు ధర్మశాలలు బీహార్ హిందూ రిలీజియస్ ట్రస్టుల చట్టం, 1950 ప్రకారం తప్పనిసరిగా బీఎస్‌బీఆర్టీలో నమోదు చేయబడాలి. అనధికార క్లెయిమ్‌ల నుంచి దేవాలయాల భూమితో సహా ఆస్తులను రక్షించడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అధికారులు పదే పదే గుర్తు చేసినప్పటికీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంకా 4000 దేవాలయాలు, మఠాలు, ట్రస్ట్‌లు రిజిస్టర్‌ కాలేదు. అవి బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ (BSBRT)లో మూడు నెలల్లోగా నమోదు చేసుకోవాలి. అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లు తమ తమ జిల్లాల్లో నమోదుకాని సంస్థలన్నీ మూడు నెలల్లోగా రిజిస్టర్ అయ్యేలా చూడాలని తాను అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లకు లేఖ పంపుతున్నానని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ అన్నారు. రిజిస్టర్ కాని దేవాలయాలు, మఠాలు, ట్రస్టులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో విఫలమైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి వస్తుందన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్‌లో కొంత భాగాన్ని కొన్ని నమోదిత దేవాలయాలు ట్రస్టుల వద్ద తగినంత డబ్బు లేకపోతే ఫెన్సింగ్ కోసం ఉపయోగించవచ్చని మంత్రి చెప్పారు. ఆ పరిస్థితిలో ఎమ్మెల్యేలు రిజిస్టర్డ్ పబ్లిక్ దేవాలయాలు, ట్రస్టుల జాబితాను ఇవ్వాలన్నారు. బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ డేటా ప్రకారం రాష్ట్రంలో మొత్తం నమోదిత దేవాలయాల సంఖ్య 3002 కాగా.. వాటికి 18,500 ఎకరాలకు పైగా భూమి ఉంది. 35 జిల్లాల నుంచి అందిన, బీఎస్‌బీఆర్‌టీ సంకలనం చేసిన తాజా డేటా ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 4055 నమోదుకాని దేవాలయాలు, మఠాలు ఉన్నాయని.. అవి 4400 ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్నాయన్నారు. జిల్లాల పరిపాలన విభాగం నుంచి అందిన సమాచారం ప్రకారం.. ముజఫర్‌పూర్ (433), సమస్తిపూర్ (272), దర్భంగా (259), తూర్పు చంపారన్ (226), భాగల్‌పూర్ (210), వైశాలి (209)లో అత్యధిక సంఖ్యలో నమోదుకాని దేవాలయాలు, మఠాలు ఉన్నాయి. సీతామర్హి (203), రోహ్తాష్ (210), భోజ్‌పూర్ (197), బెగుసరాయ్ (170), నలంద (159), సరన్ (154) జిల్లాల్లో నమోదు కానీ దేవాలయాలు ఉన్నాయని బీఎస్‌బీఆర్టీ డేటా పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)