జ్యువెలరీ షాపులో హస్తలాఘనం చూపిన మహిళ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 26 November 2022

జ్యువెలరీ షాపులో హస్తలాఘనం చూపిన మహిళ !


ఉత్తరప్రదేశ్, గోరఖ్ పూర్ లోని  బల్దేవ్ ప్లాజాలోని బెచు లాల్ సరాఫా ప్రైవేట్ లిమిటెడ్ జ్యువెలరీ షాపులో నవంబర్ 17 న  నగల దుకాణంలో ఓ మహిళ 10 లక్షల రూపాయల విలువైన నెక్లెస్‌ను దొంగిలించిన వీడియో ఇంటర్నెట్‌లో ఇటీవల వైరల్ అవుతోంది. కస్టమర్ లా నగల దుకాణానికి వెళ్లిన ఓ మహిళ చూపించిన చేతివాటం ఆ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. షాపు సిబ్బందిని, నగలు కొనడానికి వచ్చిన ఇతర కస్టమర్ల కళ్లుగప్పి విలువైన నగతో ఉడాయించింది. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజీలో, మహిళ షాపులోని నెక్లెస్ సెట్లను చూస్తూ తన చీరలో నెక్లెస్ ను దాచిపెట్టింది. దుకాణం యజమానులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓ నెక్లెస్‌ కనిపించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగిలించిన నగ విలువ సుమారు పది లక్షల దాకా ఉంటుందని షాపు యజమాని మీడియాకు తెలిపారు. సదరు మహిళా దొంగపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

No comments:

Post a Comment