బాబాయ్, అబ్బాయ్ ఒకటయ్యారు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటు చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన బాబాయ్, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్ ఒక్కటయ్యారు. మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు ముందు ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోవడంతో ఒకే వేదికపై చేరారు. ఈ సందర్భంగా శివపాల్ పాదాలను తాకి అఖిలేష్ ఆశీర్వాదం తీసుకున్నారు. ములాసింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం శివపాల్ సింగ్ యాదవ్‌ను అఖిలేష్ యాదవ్ దంపతులు కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా డింపుల్ యాదవ్ గెలుపునకు కృషి చేస్తానని శివపాల్ సింగ్ యాదవ్‌ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కోడలు గెలుపు కోసం ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సైఫాయ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు, బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్‌కు విభేదాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారని.. కానీ చాలా దూరాలు ఉన్నాయని చెబుతారు. అయితే తాను ఎప్పుడు తమ మధ్య ఎప్పుడూ దూరం లేదని అన్నారు. రాజకీయాల్లో విభేదాలు వచ్చినా దూరం కాలేదన్నారు. నేడు రాజకీయాల మధ్య దూరం కూడా తొలగిపోవడంతో సంతోషంగా ఉందన్నారు. మెయిన్‌పురి ప్రజలు తమ పార్టీకి మద్దతుగా ఉన్నారని.. బీజేపీకి కంగారు తప్పదన్నారు. డింపుల్ యాదవ్‌కు భారీ విజయాన్ని అందించాలని శివపాల్ సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు. అఖిలేష్‌తో మనస్పర్థలు తొలగించుకున్నామని తెలిపారు. ములాయం సింగ్ మన అందరిలో ఉన్నారని అన్నారు. తాము అందరం ఒక్కటయ్యామని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)