కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల విస్తరణ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని  హై టెక్ సిటీలో మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ట్రూ బీమ్ రేడియేషన్ మెషిన్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తూ  "హై టెక్ సిటీ మెడికవర్ ఆసుపత్రిలో ట్రూ బీమ్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. క్యాన్సర్ అనేది చికిత్స ద్వారా తగ్గించే వ్యాధి. ఎక్కువగా ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలని కోరుతున్నా. చెల్లింపుల గురించి ఎలాంటి ఆందోళన వద్దు. తెలంగాణ ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తుంది. పేదలకు వైద్యం అందించాలి. పేద వారి కోసం మనం ఆలోచన చేయాలి. రూ.11,440 కోట్లను ప్రజల వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 8 మెడికల్ కాలేజీలు ఒకే రోజున ప్రారంభించుకోబోతున్నం. అదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ లో క్యాథ్ ల్యాబ్ లు ఏర్పాటు చేసుకున్నాం. మహబూబ్ నగర్, సిద్దిపేట లో త్వరలో క్యాథ్ ల్యాబ్స్ ప్రారంభం కానున్నాయి. జిల్లాల్లో మోకీలు మార్పిడి సర్జరీలు చేసుకుంటున్నాం. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల విస్తరణ జరుగుతుంది. మానవత్వంతో, ప్రేమతో ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నా" అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)