పులుల సంచారంతో రైతుల్లో భయాందోళనలు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం బీం జిల్లాల్లో పులుల  సంచారం పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పశువులపై పంజా విసిరిన పులులు ఇప్పుడు మనుషులపై పడుతున్నాయి. పత్తిచేనులో అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రెండేళ్ల తర్వాత మరో ప్రాణం తీయడం తో ఉమ్మడి జిల్లా జనం హడలిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై పరుగులు పెట్టడం కలకలం సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్ల పాటు వరుసబెట్టి పశువులను చంపేశాయి. తాజాగా కొమురం భీం జిల్లా వాంకిడి మండలం చౌపన్గూడ గ్రామపంచాయతీ పరిదిలోని ఖానాపూర్ కుచెందిన సిడాం భీము పత్తిచేనులో ఉండగా పులి దాడి చేసి చంపేసింది దాడి చేయడమే కాకుండా కొంత దూరం లాక్కెల్లింది. తీవ్ర రక్తస్రావం కావడంతో భీము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అదే శివారులో పోడు సర్వే చేస్తున్న అటవీశాఖ అధికారులు సమాచారం చేరడంతో చప్పుళ్లు చేస్తూ స్పాట్ కు చేరుకున్నారు. అప్పటికే పులి మనిషిని లోయలో పడేసి పారిపోయిందని క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పారు. దాడి చేసింది పులా, చిరుత పులా అనేది జిల్లా ఉన్నతాధికారులు తేల్చలేదు. పాదముద్రలు సైతం గుర్తించారు అధికారులు స్థానికులు కళ్లారా పులిని చూశామంటున్నారు…పులిని చూడ్డంతోపాటు మనిషి ప్రాణాలు కోల్పోవడం అటవీ ప్రాంత గ్రామాల్లో పులి పేరు చెప్పితేనే జడుసుకుంటున్నారు..ఒక్క ఖానాపూర్ మాత్రమే కాదు కొమురం భీం జిల్లాలోని వాంకిడి, కాగజ్ నగర్ అటవీ ప్రాంతాలతోపాటు పల్లెలన్నీ బిక్కుబిక్కుమంటున్నాయి. రోజు కో చోట పాదముద్రలు లేదా పులిని చూశామనే జనం చెప్పుతుంటే మరింత భయాన్ని కల్పిస్తున్నాయి. పది రోజులుగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ ,జైనాథ్ మండలాల్లోని పలు గ్రామాల శివార్లలో ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు పులులు సంచారం వీడియోల రూపంలో వెలుగులోకి వచ్చింది..అలా పులులు రోడ్డెక్కాయో లేదో మరుసటి రోజే గుంజాల అటవీప్రాంతంలో ఓ ఆవుదూడను చంపేసింది..దాని తర్వాత పిప్పల్ కోటీ శివారులో లేగ దూడ పై దాడి చేసింది పులి..అయితే అది గాయాలతో ఇంటికి చేరింది.ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కొమురం భీం జిల్లాలో పులి దాడిలో భీము అనే రైతు ప్రాణాలు కోల్పోవడం ఉమ్మడి జిల్లా జనంలో వణుకుపుట్టిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)