కారుతో సెక్యూరిటీ గార్డును ఢీ కొట్టిన నిందితుడు

Telugu Lo Computer
0


నోయిడాలోని అమ్రపాలీ జోడియాక్‌ సోసైటీలో వుండే నీరజ్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక ప్రైవేట్‌ కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తన సహోద్యోగిని అత్యాచారం చేసినట్లు సింగ్‌పై కేసు నమోదైంది. ఆ కేసు విషయమై పోలీసులు అతన్న అరెస్టు చేసేందుకు పలుమార్లు అపార్ట్‌మెంట్‌ సోసైటికీ వచ్చినా సింగ్‌ తప్పించుకుని తిరగుతున్నాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులకు సింగ్‌ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారం అందడంతో సదరు సోసైటికి వచ్చారు . దీన్ని పసిగట్టిన సింగ్‌ తన కారుతో తప్పించుకునేందుకు యత్నించాడు. దీంతో సింగ్‌ని సెక్యూరిటీ గార్డు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ సింగ్‌ చాలా కర్కశత్వంగా అతనిపై నుంచి కారుని దూసుకెళ్లిపోయాడు. ఇంతలో మరో అధికారి అతని కారుని వెంబడించి సదరు నిందితుడు సింగ్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)