విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్స్, మద్యం బాటిళ్లు, సిగరెట్లు !

Telugu Lo Computer
0


కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ పాఠశాలలో 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల బ్యాగుల్లో మద్యం బాటిళ్లు, కండోమ్‌లు, గర్భనిరోధకాలు, సిగరేట్లు ఉండటం సంచలనంగా మారింది. కొందరి నుంచి అందిన ఫిర్యాదుల మేరకు విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని పాఠశాలల్లో పేరెంట్-టీచర్ సమావేశాలను నిర్వహించి అధికారులు అవగాహన కల్పించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆ విద్యార్థులను సస్పెండ్ చేయకుండా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ ట్యూషన్లు, తోటి విద్యార్థుల సహవాసంతోనే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని పలువురు విద్యార్థులు తెలిపారు. నగరంలోని 80 శాతం పాఠశాలలకు ఈ తనిఖీల గురించి అధికారులు వివరించారు. కొన్ని పాఠశాలల్లోని విద్యార్థులు వాటర్ బాటిళ్లలో మద్యం తీసుకొస్తున్నారని తేలిందన్నారు. పాఠశాల విద్యార్థుల వద్ద ఇలాంటి వస్తువులను చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని కేఏఎంఎస్ జనరల్ సెక్రటరీ డీ శశికుమార్ తెలిపారు. అంతేగాక, కొందరు విద్యార్థులు తరగతుల్లో టీచర్లను కూడా ఆటపట్టించడం, వేధించడం చూశామన్నారు. విద్యార్థులు ఉపయోగించే భాష కూడా చాలా హీనంగా ఉందన్నారు. ఐదో తరగతి విద్యార్థులు ప్రవర్తన కూడా సరిగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులు ఫోన్లు వినియోగిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)