ప్రియురాలి మోజులో భార్య హత్య చేసిన భర్త !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో స్వప్నిల్ సావంత్, ప్రియాంక అనే యువతిని కొన్నేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. స్వప్నిల్‌ ఓ ప్రైవేట్ ఆస్పత్రి పని చేస్తుండగా, ఆ సమయంలో అదే ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ నర్సుతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఆమెపై ప్రేమకు దారితీసింది. ఎలాగైనా ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే అప్పటికే అతనికి ప్రియాంకతో వివాహం జరిగింది. తన రెండో పెళ్లికి మొదటి భార్య అడ్డుగా ఉందని భావించిన అతను ఎలాగైనా ప్రియాంకను హతమార్చాలని ప్లాన్‌ చేసుకున్నాడు. బీపీ, షుగర్ చికిత్స అని చెప్పి తాను పనిచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఎవరికీ తెలియకుండా ప్రమాదకరమైన ఇంజెక్షన్లను భార్యకు ఇచ్చాడని పోలీసులు వెల్లడించారు. వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతిని ప్రియాంక ప్రాణాలు కోల్పోయింది. అనుమానం వచ్చిన ప్రియాంక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.  అతనిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)