స్పైసీ గుమ్మడికాయ సమోసా ?

Telugu Lo Computer
0


టేస్టీ స్నాక్‌గా నోరూరించే క్రిస్పీ సమోసాలను ఇష్టపడని వారు అరుదు. స్పైసీ పొటాటోస్‌, పల్లీలతో కూడిన సమోసాలను అంతా ఇష్టంగా తింటారు. అయితే గుమ్మడి, పనీర్ స్టఫ్ చేసిన సమోసాలను మీరు ఎప్పుడైనా విన్నారా..వాటిని టేస్ట్ చేశారా..? అసలు ఇవేం సమోసాలని మీరు అనుకుంటే ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ స్పైసీ పోస్ట్‌పై లుక్కేయాలి మరి. అమెరికన్ గ్రాసరీ బ్రాండ్ ట్రేడర్ జోస్ స్పైసీ పంప్‌కిన్ సమోసాల బాక్స్‌ను చూపుతూ షేర్ చేసిన పోస్ట్ ఆన్‌లైన్‌లో తెగ వైరలవుతోంది. డాక్టర్ మ్యాట్లీ ఈ పోస్ట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆరంజ్ కలర్‌లో ఉన్న స్పైసీ పంప్‌కిన్ సమోసాస్ బాక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ సమోసాలను టేస్ట్ చేసేందుకు వేచిచూస్తున్నామని పలువురు నెటిజన్లు కామెంట్స్ సెక్షన్‌లో రాసుకురాగా, మరికొందరు ఈ సమోసాలపై పెదవివిరిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)