చైనాలో కరోనా మరణం !

Telugu Lo Computer
0


చైనా లో కఠిన లాక్‌డౌన్‌లు పాటిస్తోందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌లు విధిస్తున్నా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా చైనాలో 6 నెలల తర్వాత మళ్లీ కొవిడ్ మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు అక్కడ కొవిడ్‌ మృతుల సంఖ్య 5,227కు చేరుకున్నట్లు చైనా పేర్కొంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ‘జీరో కోవిడ్ పాలసీ’ పేరిట కఠిన ఆంక్షలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది మే 26న షాంఘైకు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే మరో వ్యక్తి వైరస్ కారణంగా చనిపోయాడు. బీజింగ్‌కు చెందిన ఓ 87ఏళ్ల వృద్ధుడు తాజాగా కొవిడ్‌తో చనిపోయినట్లు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. చైనాలో దాదాపు 92 శాతం మంది కనీసం ఒక్కడోసు కరోనా టీకా తీసుకున్నారు. అయితే వృద్ధులకు టీకాలు సరిగా పంపిణీ చేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరణించిన వ్యక్తి కూడా టీకా తీసుకున్నాడా? లేదా? అనే విషయంపై ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)