డిసెంబర్ నుంచి అమెజాన్ ఫుడ్ సర్వీసు బంద్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 26 November 2022

డిసెంబర్ నుంచి అమెజాన్ ఫుడ్ సర్వీసు బంద్ !


అమెజాన్ తన సర్వీసులలో ఒకటైన ఫుడ్ సర్వీసును మూసివేయనుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది కస్టమర్లు ప్రభావితం కానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా ప్రకటించింది. వచ్చేనెల డిసెంబర్ నుంచి భారత్ లో అమెజాన్ ఫుడ్ సర్వీసును నిలివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసు డిసెంబర్ 29 నుంచి పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ ఫుడ్ సర్వీసును 2020లో ప్రారంభించింది. కోవిడ్ సమయంలో ఈ సర్వీస్ ను ప్రవేశపెట్టింది. దీంతో ఎంతో మంది ప్రయోజనం పొందారు. స్విగ్గీ, జొమాటోలకు పోటీగా కంపెనీ ఈ సర్వీసును ప్రారంభించింది. మొదటిసారిగా బెంగుళూరులో ఈ సర్వీసును ప్రవేశపెట్టారు. ఇతర నగరాలకు కూడా విస్తరించేలా ప్లాన్ చేసింది కంపెనీ. అయితే కంపెనీ తన టార్గెట్ ను రీచ్ అవ్వలేకపోయింది. దీంతో శాశ్వతంగా ఫుడ్ సర్వీసును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అమెజాన్ ఓ ప్రకటనను విడుదలు చేసింది. అయితే కంపెనీ దశలవారీ ఈ ప్రోగ్రామ్ లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసు వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారికి అమెజాన్ అండగా నిలుస్తుందని ప్రకటించింది.

No comments:

Post a Comment