అంగరంగ వైభవంగా కుక్కల పెళ్లి !

Telugu Lo Computer
0


గురుగ్రామ్‌లోని పాలం విహార్‌లోని జిలే సింగ్ కాలనీలో షేరు అనే మగ కుక్క స్వీటీ అనే ఆడకుక్కను వివాహం చేసుకుంది. భారతీయ ఆచారాలకు తగ్గట్టు వాటి యజమానులు పెళ్లి నిర్వహించారు. ఇరుగుపొరుగు వారందరూ ప్రేమగా ఆనందంతో పెళ్లిలో పాల్గొన్నారు. స్వీటీ (ఆడకుక్క) యజమాని సవిత మాట్లాడుతూ తన భర్త గుడి సమీపంలోని కుక్కలకు రోజు ఆహారం పెట్టేవాడని, ఒకరోజు ఇంటికి తిరిగి వస్తుంటే ఓ కుక్క తనను అనుసరించిందని తెలిపింది. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో అప్పటి నుంచి స్వీటీ పేరు పెట్టి సాదుకుంటున్నట్లు తెలిపింది. వారు నివసించే పక్క ఇంట్లో షేరు అనే మగ కుక్క ఉండేది. పెళ్లి ప్రపోజ్ చేయగా అందుకు వాళ్లు అంగీకరించారు. చివరకు నాలుగు రోజుల్లో పెళ్లికి ఏర్పాట్లు చేశాం అని సవిత తెలిపింది. వరుడు షేరు (మగకుక్క) తల్లి మణిత మాట్లాడుతూ షేరును ఎనిమిదేళ్లుగా తమ కొడుకులాగా పెంచుకుంటున్నామని, స్వీటీతో పెళ్లి ప్రపోజల్ రావడంతో ఒప్పుకున్నామన్నారు. అందరితో కలిసి ఆనందంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం సంప్రదాయ పద్ధతిలో పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ పెళ్లికి 100 మందిని ఆహ్వానించారు. 25 పెళ్లి పత్రికలను కూడా ముద్రించిన ఆహ్వానాలు ,ఆన్‌లైన్ ఆహ్వానాలు కూడా పంపారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి సామెత విన్నాం కానీ కుక్కల పెళ్లికి మనుషుల హడావుడి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)