అంపైర్‌ను బూతులు తిట్టిన ఆస్టన్‌ అగర్‌ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 17 November 2022

అంపైర్‌ను బూతులు తిట్టిన ఆస్టన్‌ అగర్‌ !


ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ ఫీల్డ్‌ అంపైర్‌తో మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య​ వివాదం పెరగడంతో సహనం కోల్పోయిన అగర్‌ అంపైర్‌ను బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్రీజులో కుదురుకున్న డేవిడ్‌ మలాన్‌, సామ్‌ బిల్లింగ్స్‌ జోడిని విడదీయడానికి కమిన్స్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ చేతికి బంతినిచ్చాడు. బంతితో వికెట్లు తీయాల్సింది పోయి, బంతి వేసిన తర్వాత పదే పదే పిచ్‌పైకి వస్తూ బ్యాటర్లను అడ్డుకున్నాడు. ఇది చూసిన ఫీల్డ్‌ అంపైర్‌ పాల్ రీఫెల్ అగర్‌ను హెచ్చరించాడు. ''పదే పదే పిచ్‌పై పరిగెత్తడం కరెక్ట్‌ కాదు..'' అని  అంపైర్‌ అనడం స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. ఇది విన్న అగర్‌ వెంటనే.. ''మీరు అనేది ఏంటి ! నేను బంతిని అంచనా వేయడానికి మాత్రమే పరిగెడుతున్నా'' అంటూ సమాధానమిచ్చాడు. అగర్‌ సమాధానంతో ఏకీభవించని అంపైర్‌.. ''బ్యాటర్‌ బంతిని కొట్టింది మిడ్‌ వికెట్‌ వైపు.. నువ్వు పిచ్‌పైకి ఎందుకు వస్తున్నావు.. అంటే బ్యాటర్‌ను అడ్డుకోవడానికే కదా'' అంటూ తెలిపాడు. ఇది విన్న అగర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. అంపైర్‌ మీదకు దూసుకొచ్చిన అగర్‌ అసభ్యకరమైన పదంతో దూషించాడు. ఇదంతా స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. ఆ తర్వాత కూడా అగర్‌, పాల్‌ రీఫెల్‌లు వాదులాడుకోవడం కనిపించింది. అయితే ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగినందుకు ఆస్టన్‌ అగర్‌కు జరిమానా పడే అవకాశం ఉంది.

No comments:

Post a Comment