మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని వరోర తాలూకా పరిధిలో మాజిరి గ్రామ పరిసర ప్రాంతంలోని రహదారిపై పులి సంచారం హడల్ ఎత్తిస్తోంది. నడిరోడ్డుపై సేదతీరుతూ గాండ్రిస్తున్న టైగర్ తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పులి వీడియో తీసిన యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. గ్రామస్తులు ఇక్కడ పులులు రోడ్డుమీద తిరుగుతున్నాయని ప్రయాణికులు ఇబ్బందిగా మారిందని వాపోయారు. అధికారులు స్పందించకపోతే పులి మనుషులపై పంజా విసిరే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పులులను కట్టడి చేయకపోతే ఇబ్బంది ఎదుర్కొనవలసి ఉంటుందని గ్రామస్థులు కోరుతున్నారు.
No comments:
Post a Comment