మరణించిన వాడినే సర్పంచ్‌గా గెలిపించారు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 15 November 2022

మరణించిన వాడినే సర్పంచ్‌గా గెలిపించారు


హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా జన్‌దేడీ గ్రామంలో రెండో విడతలో భాగంగా కురుక్షేత్ర జిల్లాలో నవంబరు 12న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు తర్వాత వచ్చిన ఫలితాలను ఎన్నికల అధికారులు షాకయ్యారు. జన్దేడీ పంచాయతీ సర్పంచ్ పదవికి ముగ్గురు పోటీ చేశారు. అందులో మృతుడు రాజ్‌బీర్‌ ఒకరు. అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజ్‌బీర్ సింగ్ ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందు మెదడులో నరాలు చిట్లి పోలింగ్ కు  వారం క్రితమే మరణించారు. నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో మృతుడు రాజ్‌బీర్‌ సింగ్‌కే గ్రామస్థులు ఓటు వేసి గెలిపించారు. పోటీలో ఉన్న మరో ఇద్దరు అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆ ఊరిలో మొత్తం 1,790 ఓట్లు ఉండగా.. అందులో 1660 ఓట్లు పోలయ్యాయి. మెజార్టీ ఓట్లు మృతుడు రాజ్‌బీర్‌ సింగ్ పొంది విజయం సాధించారు. మృతుడికి 17 ఏళ్ల కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మళ్లీ జరిగే ఎన్నికల్లో రాజ్వీర్ సింగ్ భార్యను గెలిపిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. రాజ్‌బీర్‌ సంతానానికి ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన వయసులేదని అన్నారు. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల్లో జన్వాడీ పంచాయతీకి మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

No comments:

Post a Comment