ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ పెట్టి.....! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 18 November 2022

ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ పెట్టి.....!


గుజరాత్ ఎన్నికల కోసం జనరల్ అబ్జర్వర్‌ గా ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అభిషేక్ సింగ్ ను ఈసీ నియమించింది. అహ్మదాబాద్, బాపూనగర్, అస్వారా అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యతలు ఆయనకు అప్పగించింది. ఇదే విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోతో సహా షేర్ చేశారు. ''గుజరాత్ ఎన్నికల పరిశీలకుడిగా అహ్మదాబాద్‌లో జాయిన్ అయ్యాను'' అంటూ సూటు బూటుతో సహా ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన వాహనంతో ఆయన ఫోటోకు ఫోజిచ్చారు. దానిపై ఎన్నికల కమిషన్ గుర్రుమంది. అధికారిక హోదాను పబ్లిసిటీ స్టంట్‌గా ఉపయోగించుకోవడాన్ని తప్పుపడుతూ ఎన్నికల అబ్జర్వర్ విధుల నుంచి ఆయనను తప్పించింది. అతనిని విధుల నుంచి తప్పించడమే కాకుండా తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఎన్నికల విధుల నుంచి డిబార్ చేసిందని ఈసీ వర్గాలు తెలిపాయి. శక్రవారంనాడు ఆయన తన నియోజకవర్గం విడిచిపెట్టాల్సి ఉంటుందని, అబ్జర్వర్ విధుల్లో ఆయనకు కేటాయించిన సౌకర్యాలన్నీ తక్షణమే రద్దవుతాయని ఆ వర్గాలు చెప్పాయి. అభిషేక్ స్థానంలో మరో ఐఏఎస్ అధికారి కృష్ణ బాజ్‌పేయిని ఈసీ నియమించింది.

No comments:

Post a Comment