పీఎస్‌ఎల్‌వీ సీ54 కి ప్రత్యేక పూజలు

Telugu Lo Computer
0


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ  పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. రాకెట్ ప్రయోగానికి శుక్రవారం ఉదయం 10.26 గంటల నుంచే కౌంట్ డౌన్ మొదలైంది. ఆనవాయితీ ప్రకారం  ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ శుక్రవారం షార్‌ సమీపంలో చెంగాళమ్మ ఆలయంతోపాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలాఉంటే ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపించే ఎనిమిది ఉపగ్రహాల్లో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ధ్రువస్పేస్‌ రూపొందించిన థైబోల్ట్‌ 1, థైబోల్ట్‌ 2 ఉపగ్రహాలుకూడా ఉన్నాయి. ఈ ఉపగ్రహాలు రేడియో కార్యకలాపాలకు సంబంధించిన పేలోడ్లను కక్ష్యలోకి తీసుకెళ్లనున్నాయి. దాదాపు 20 ఎంఎస్ఎంఈల సహాయంతో ఈ ఉపగ్రహాలను పూర్తిగా హైదరాబాద్‌లోనే నిర్మించామని ధ్రువ స్పేస్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సంజయ్‌ నెక్కంటి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రేడియో ఆపరేటర్లకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)