తక్షణ చర్యలకు డీజీసీఏ ఆదేశం !

Telugu Lo Computer
0


స్పైస్‌జెట్ విమానం క్యాబిన్‌లో పొగలు వచ్చిన ఘటనపై డెరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్  చర్యలకు దిగింది. ఇంజన్ తయారీదారులైన ప్రాంట్ అండ్ విట్నీకి ప్రతి 15 రోజులకు ఆయిల్ శాంపుల్స్‌ను పంపాలని స్పైస్‌జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది. అలాగే వారం రోజుల్లోగా మొత్తం 28 ఇంజన్లకు బయోస్కోపిక్ ఇన్‌స్పెక్షన్ జరిపించాలని స్పష్టం చేసింది. ఈ నెల మొదట్లో గోవా నుంచి వస్తున్న స్పెస్‌జెట్ విమానం క్యాబిన్‌లో పొగలు రావడంతో హైదరాబాద్ విమానాశ్రయంలో దానిని అత్యవసరంగా ల్యాండ్ చేసిన నేపథ్యంలో డీజీసీఏ ఈ తాజా చర్యలకు దిగింది. హైదరాబాద్ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్‌ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్యాబిన్ సిబ్బింది, విమానాశ్రయ సిబ్బంది సాయంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 86 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణంగా తొమ్మిది విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)