వర్షాలకు కూలిన మైసూరు ప్యాలెస్‌ ప్రహరీ

Telugu Lo Computer
0


గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం అంబావిలాస్‌ ప్యాలెస్‌ ప్రహరీ ఓ వైపు కూలిపోయింది. మైసూరు ప్యాలెస్‌ అంటేనే దేశవిదేశీయులు అత్యంత ఆసక్తిగా ఇష్టపడే భవనం. నిరంతరంగా వర్షాలు కురుస్తున్నా పర్యవేక్షించక పోవడంతోనే కోటకు అనుబంధంగా ఉండే గోడ కూలింది. మారెమ్మ ఆలయం, జయమార్తాండ ప్రధాన ద్వారాల మధ్య ఉండే గోడ కూలింది. శత్రువులు దాడి నుంచి రక్షణ పొందేందుకు ప్యాలె్‌సకు మైసూరు మహారాజు కోటను నిర్మించారు. నిరంతరంగా వర్షాలు కురుస్తున్నా కనీస పర్యవేక్షణ చేయక పోవడమే కోట గోడ కూలేందుకు కారణమని స్థానికులు అభిప్రాయపడ్డారు. విషయం తెలియగానే జిల్లాధికారితో పాటు పురావస్తు నిపుణులు పరిశీలించారు. ప్యాలెస్‌ నిర్మాణాలు జరిగి శతాబ్దాలు కావస్తోంది. ఏటా వర్షాలు, ఎండల వలన జరిగే మార్పులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. పట్టించుకోని కారణంగానే ప్యాలెస్‏కు పలు చోట్ల పగళ్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో వర్షాలు కొనసాగితే పలు చోట్ల కోటగోడలు కూలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పురావస్తు శాఖ నిపుణులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే మైసూరులోని ల్యాన్‌స్టోన్‌ భవనం, దేవరాజు మార్కెట్‌, అగ్నిమాపక కేంద్రంతో పాటు పలు కట్టడాలు నేలకూలాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)