డాక్టర్ ఉమా గవిని ఔదార్యం !

Telugu Lo Computer
0


డాక్టర్ ఉమా గవిని తనకు ఉన్న 20 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చేశారు. చివరకు తనకోసం ఉంచుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగుల్చుకోకుండా ఆసుపత్రికి డొనేట్ చేశారు. జీజీహెచ్ లో  కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన వైద్యురాలు ఉమా అమెరికాలో ఇమ్మునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు. 1965 సంవత్సరం లో మెడిసిన్ పూర్తి చేసిన ఉమా, ఆ తర్వాత నాలుగు దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లిపోయారు. స్పెషలిస్ట్ డాక్టర్ గా అక్కడే స్థిరపడ్డారు. అయితే డల్లాస్ వేదికగా గత నెల గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికాకు చెందిన జింకానా 17వ రీ యూనియన్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ఉమా తాను మెడిసిన్ చదువుకున్న గుంటూరు జీజీహెచ్ కు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కనీసం బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంచుకోకుండా ఉమా తన యావదాస్తిని విరాళంగా ఇచ్చారు. ఉమా భర్త డాక్టర్ కానూరి రామచంద్ర రావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చేసి అమెరికాలో మత్తు వైద్యులుగా సేవలందించారు. మూడేళ్ల కిందట ఆయన మృతి చెందారు. ఇక ఈ దంపతులకు వారసులు కూడా లేకపోవడంతో డాక్టర్ ఉమ తన ఆస్తినంతా గుంటూరు జిజిహెచ్ కు ఇచ్చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)