గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న నగరాలలో రాజమహేంద్రవరం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 24 October 2022

గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న నగరాలలో రాజమహేంద్రవరం !


ఆసియా ఖండంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న టాప్ టెన్ నగరాల్లో ఎనిమిది ఇండియాలోనే ఉన్నాయని ప్రపంచ వాయు నాణ్యత సూచీ (వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) హెచ్చరించింది. అదే సమయంలో ఆసియాలోని అత్యంత కలుషిత నగరాలు ఎక్కువగా భారత్ లోనే ఉన్నాయని వెల్లడించింది. గాలి నాణ్యత విషయంలో ఏయే నగరాలు మెరుగ్గా ఉన్నాయి, ఏయే నగరాలు అధ్వాన్నంగా ఉన్నాయని పరిశీలించి ఓ నివేదికను విడుదల చేసింది. ఆసియాలోని కలుషిత నగరాల జాబితాలో టాప్ టెన్ లో ఎనిమిది భారతీయ నగరాలే.. అందులో గురుగ్రామ్ టాప్ లో ఉంది. ఆదివారం ఉదయం గురుగ్రామ్ లో గాలి నాణ్యత సూచి(ఏక్యూఐ) 679 పాయింట్లుగా ఉంది. రేవారి దగ్గర్లోని ధారుహెర నగరంలోనూ కాలుష్యం ఎక్కువే. ఇక్కడ ఏక్యూఐ 543 పాయింట్లుగా నమోదైంది. బీహార్ లోని ముజఫర్ నగర్ లో ఏక్యూఐ 316 పాయింట్లు, లక్నో దగ్గర్లోని తాల్కోర్ ఏక్యూఐ 298 పాయింట్లు, డీఆర్ సీసీ ఆనంద్ పూర్ (బెగుసరాయ్) లో 269 పాయింట్లు, భోపాల్ ఛౌరాహా (దేవాస్) లో 266 పాయింట్లు, ఖడక్ పాడ(కళ్యాణ్)లో 256 పాయింట్లు, దర్శన్ నగర్(చప్రా)లో 239 పాయింట్లుగా ఏక్యూఐ నమోదైందని వెల్లడించింది. చైనాలోని క్సియోషియాంగ్ సిటీతో పాటు మంగోలియాలోని ఉలాన్ బాటా నగరం కూడా టాప్ టెన్ లో ఉంది. మరోవైపు, ఆసియాలో గాలినాణ్యత మెరుగ్గా ఉన్న నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం చోటు దక్కించుకుంది. ఆసియాలోని టాప్ టెన్ నగరాల్లో భారత్ నుంచి టాప్ టెన్ లో నిలిచిన ఒకే ఒక నగరం రాజమహేంద్రవరం. స్విస్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ నివేదిక ప్రకారం ఇండియాలో హైదరాబాద్ నగరం అత్యంత కాలుష్య నగరంగా ఉంది. వాయు కాలుష్య స్థాయి 159 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్గా నమోదైంది. భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. భారతదేశం ముఖ్యమైన నగరాల్లో, దిల్లీ, కోల్‌కతా, ముంబై తర్వాత నాల్గో అత్యంత కాలుష్య నగరంగా హైదరాబాద్ ఉంది. ఇది దేశంలోని దక్షిణ భారతంలో అత్యంత కలుషితమైన సిటీగా నమోదైంది. అక్టోబర్ 21న IQAir వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం, నగరంలో వాయు కాలుష్య స్థాయి 159 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా ఉంది.

No comments:

Post a Comment