ఆర్ధిక మాంద్యం భయాలతో దిగివస్తున్న చమురు ధరలు

Telugu Lo Computer
0


ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో పాటు చైనాలో కొవిడ్‌-19 నియంత్రణలను కఠినతరం చేయడంతో బుధవారం వరుసగా మూడో రోజూ చమురు ధరలు పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.5 శాతం తగ్గి 93.78 డాలర్లకు దిగివచ్చింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మిడియట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.8 శాతం పతనమై 88.66 డాలర్లకు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ ఆర్ధిక మాంద్యం ముప్పు పెరుగుతున్నదని ఐఎంఎఫ్ హెచ్చరిస్తూ 2023లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలో కోత విధించింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు వినియోగ దేశమైన చైనాలో కొవిడ్‌-19 నియంత్రణలను కఠినతరం చేయడంతో చమురు మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. ఆగస్ట్ తర్వాత చైనాలో అతిపెద్ద నగరాలైన షాంఘై, షెంజెన్ వంటి సిటీల్లో కేసుల పెరుగుదలతో కొవిడ్‌-19 టెస్టింగులు పెంచడం సహా పలు నియంత్రణలు చేపట్టారు. కొవిడ్‌-19 పాలసీలో ఎలాంటి సడలింపులు ఉండవని చైనా అధికారులు చెబుతుండటం చైనాలో చమురు డిమాండ్ మరింత తగ్గుతుందని ఏఎన్‌జడ్ రీసెర్చి అనలిస్ట్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేట్లలో కఠినంగా వ్యవహరించాలని ఆయా దేశాల కేంద్ర బ్యాంకులను ఐఎంఎఫ్ కోరింది. అమెరికన్ ద్రవ్యోల్బణ గణాంకాలు గురువారం వెల్లడికానుండటంతో ఇన్వెస్టర్లు కీలక డేటా కోసం వేచిచూస్తున్నారు. ఆర్ధిక మాంద్యం భయాలు నెలకొన్న నేపధ్యంలో ఈ గణాంకాలు మార్కెట్ దిశను నిర్ధేశిస్తాయని మార్కెట్ విశ్లేషకులు టినా టెంగ్ చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)