రిలయన్స్ హాస్పిటల్‌కు బాంబు బెదిరింపు !

Telugu Lo Computer
0


ముకేశ్ అంబానీకి చెందిన హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 12.57 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్ ల్యాండ్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి హాస్పిటల్‌కు బాంబు పెట్టినట్లు చెప్పాడు. ముకేశ్ అంబానీ కుటుంబసభ్యుల్లో కొందరి పేర్లను ప్రస్తావించి వారిని కూడా చంపేస్తామని చెప్పాడు. దీనిపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు చర్యలు మొదలుపెట్టారు. కాగా, అంబానీకి కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించిన కొన్ని నెలలకే ఇలాంటి బెదిరింపు కాల్ రావడం గమనార్హం. ముకేశ్ అంబానీకి 2013 నుంచి జడ్ కేటగిరి భద్రత ఉంది. అయితే, ఇటీవల ఆయన ఇంటిముందు పార్క్ చేసి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలు లభించాయి. దాంతో జడ్ కేటగిరీ భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి మార్చారు. అంటే ఆయనకు నిత్యం 45 నుంచి 50 మంది సాయుధులైన సీఆర్‌పీఎఫ్ కమోండోలు రక్షణ గోడలా ఉంటారు. ముకేశ్ భార్య నీతా అంబానీకి కూడా ప్రస్తుతం వై ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)