ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త !

Telugu Lo Computer
0


ప్రతీ నెలా ఏ ఇబ్బంది కలగకుండా పెన్షనర్లు డబ్బులు పొందాలంటే జీవన ప్రమాణ పత్ర ని సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది. ఇది సబ్మిట్ చేస్తేనే పెన్షన్ వస్తుంది. నవంబర్ 30, 2022 వరకు మాత్రమే గడువు వుంది. కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్లకి సబ్మిట్ చేసే డేట్ లో తేడా వుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుండి పెన్షన్ పొందే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు రిటైర్మెంట్ బాడీ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 2021న లేదా ఆ తర్వాత లైఫ్ సర్టిఫికేట్ సమర్పించి ఉంటే వారు జీవన ప్రమాణ పత్రాన్ని సబ్మిట్ చెయ్యక్కర్లేదు. జీవన ప్రమాణ పత్రా 12 నెలల పాటు వాలిడ్‌లో వుంటుందట. దీని కోసం ట్వీట్ కూడా చేసారు. , జీవన ప్రమాణ పత్ర 12 నెలల పాటు వాలిడ్‌లో ఉంటుందని..ఈపీఎస్ 95 పెన్షనర్స్ కోసం ట్వీట్ చేసింది. అలానే ఇప్పటి నుండి ఈపీఎస్ 95 పెన్షనర్లు ఏ సమయంలోనైనా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చెయ్యచ్చని అంది. కామన్ సర్వీసు సెంటర్, ఐపీపీబీ, పోస్టాఫీస్, పోస్ట్‌ మ్యాన్, ఉమాంగ్ యాప్ వంటి వాటి ద్వారా సబ్మిట్ చెయ్యచ్చు. కనుక లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం గురించి చింతించాల్సిన పని లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)