చల్లటి నీరు తాగడంతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ?

Telugu Lo Computer
0


చల్లటి నీరు తాగడం అనేది మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి హాని కలిగించే చెడు అలవాటుగా నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీరు త్రాగడం వల్ల కడుపు కుచించుకుపోతుంది. భోజనం తర్వాత ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టమవుతుంది. 36°F (4°C) కంటే తక్కువ ఉన్న నీటిని తాగుతూ ఉంటే, మీ శరీరం దాని అంతర్గత ఉష్ణోగ్రత 98.6°F (37°C)ని నిర్వహించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. చల్లటి నీరు త్రాగడం వలన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. చల్లటి నీరు త్రాగడం వల్ల నాసికా శ్లేష్మం మందంగా, శ్వాసతీసుకోవటం కష్టతరం అవుతుంది. సూప్ లు, వేడి నీరు వంటివి శ్వాస పీల్చుకోవటానికి సహాయపడతాయి. అయితే అదే సమయంలో కూల్ వాటర్ తీసుకోవటం వల్ల శ్వాస తీసుకోవటం కష్టతరంగా ఉంటుందని అధ్యయనాల్లో కనుగొన్నారు. చల్లటి నీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య పరిస్థితులు తీవ్రమవుతాయి. మైగ్రేన్‌ను ప్రేరేపించడంలో చల్లటి నీరు త్రాగటం కూడా ఒక కారణమని పరిశోధనల్లో తేలింది. చల్లని నీరు జీర్ణక్రియ సమయంలో పోషకాలను గ్రహించే సహజ ప్రక్రియను కూడా నిరోధిస్తుంది. గొంతునొప్పి ,ముక్కు కారడం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదు, ముఖ్యంగా భోజనం తర్వాత, చల్లని నీరు తాగరాదు. కడుపు నొప్పి, విరేచనాలకు కూడా కారణమవుతుంది. తల తిరుగుతుంది. బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే.. భోజనంతో పాటు చల్లటి నీటిని తాగడం మానేయండి. చల్లటి నీరు టాన్సిల్ సమస్యలను కలిగిస్తుంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం వ్యాయామం చేసే సమయంలో చల్లటి నీటిని తాగడం వల్ల శరీరం వేడెక్కకుండా వ్యాయామలు మరింత ఉత్సాహంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని తేలింది. చల్లటి నీరు త్రాగడం వల్ల మీ శరీరం ఉష్ణోగ్రతను నిర్వహించడం సులభతరం చేస్తుంది. ఏది ఏమైనా జలుబుతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చల్లని నీటిని తాగకుండా ఉండటమే మంచిది. గోరు వెచ్చని నీటిని తీసుకోవటం ఆరోగ్యానికి శ్రేయస్కరమని గుర్తుంచుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)