డ్రైవర్ సీట్లో కూర్చుని వీడియోలు తీసుకున్న లేడీ కండక్టర్

Telugu Lo Computer
0


మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‪పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన ఒక లేడీ కండక్టర్‌డ్రైవర్ సీట్లో కూర్చుని, వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఆమెను అధికారులు సస్పెండ్ చేశారు.  ఒస్మానాబాద్ జిల్లా, కలంబ్ డిపోలో సాగర్ మంగళ్ గోవర్ధన్ అనే మహిళ కండక్టర్‌గా పని చేస్తోంది. అయితే, ఆమె అధికారుల అనుమతి లేకుండా డ్రైవర్ సీట్లో కూర్చుని వీడియోలు తీసుకుంది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. అయితే, గతంలో కొందరు సిబ్బంది సమ్మె చేసిన సమయంలో తాను డ్యూటీ చేసినందుకే అధికారులు తనపై చర్యలు తీసుకున్నారని సాగర్ మంగళ్ చెప్పింది. అలాగే ఇటీవల ఆమె కొందరు సిబ్బందితో దురుసుగా మాట్లాడిందని, దీనిపై షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశామని ఎమ్ఎస్ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)