మోడీ హీరో అయితే, మీరంతా జీరోలు !

Telugu Lo Computer
0


విజయవాడలో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎమ్మెల్సీలు, పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ ఇంఛార్జులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు విజయవాడ కేంద్రంగా ఉండేవని, ఇవాళ దేశాన్ని కమ్యూనిస్టు పార్టీలు భ్రష్టు పట్టిస్తున్నాయని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. సీపీఐ పార్టీ వాళ్లను వాళ్లే తొలగించుకుంటున్నారని, వాళ్లు మోడీని తొలగిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. మోడీని గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదన్నారు. రోడ్డుపై డ్యాన్సులు వేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని, ఆ పార్టీతో దేశంలో బీజేపీ ఎక్కడా పొత్తు పెట్టుకోలేదన్నారు. త్వరలో 175 నియోజకవర్గాల్లో స్థానిక నేతల పాదయాత్రలుంటాయని తెలిపారు. విశాఖలో అభివృద్ధి వికేంద్రీకరణపై సోము వీర్రాజు మాట్లాడుతూ.. వైసీపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే తెలుసా? అని ప్రశ్నించారు. ఒకేసారి మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది బీజేపీ అని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై వైసీపీ, టీడీపీలకు పాఠాలు చెప్పగలిగే పార్టీ రాష్ట్రంలో బీజేపీనేనని అన్నారు. చైనా రాజధాని బీజింగ్ అని.. కానీ, షాంఘైని అభివృద్ధి చేస్తోందని.. అభివృద్ధి అంటే అది అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. విశాఖను అభివృద్ధి చేస్తున్నది మోడీ ప్రభుత్వమేనని అన్నారు. ఈ అంశంపై చర్చకు బీజేపీ సిద్ధమన్నారు. హుదూద్ తుఫాను అనంతరం విశాఖను కేంద్రం ఆదుకుందన్నారు. విశాఖ స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని గమనించినవారు నరేంద్ర మోడీ అని సోము వీర్రాజు చెప్పారు. చంద్రబాబు, జగన్‌ విశాఖ అభివృద్ధి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. కండ కావరం, అధికార దాహంతో ర్యాలీలు చేస్తారా? అని నిలదీశారు. బూమ్ బూమ్ మందులు అమ్ముకోవడం తప్ప అభివృద్ధి లేదని సోము వీర్రాజు విమర్శించారు. అభివృద్ధిలో మోడీ హీరో అయితే, మీరంతా జీరోలు అని అన్నారు. దోచుకోవడమే మీ విజన్ అంటూ వైసీపీ, టీడీపీలపై మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)