స్వాతంత్య్రం తర్వాత తొలిసారి రికార్డు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 7 October 2022

స్వాతంత్య్రం తర్వాత తొలిసారి రికార్డు !


స్వాతంత్య్రం అనంతరం ఎప్పుడే లేని విధంగా జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 1.62 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఇది భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధికం. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఇదే సాక్ష్యమని అక్కడి అధికారులు చెబుతున్నారు. మూడు దశాబ్ధాల తర్వాత కాశ్మీర్ పర్యటకులను ఆకర్షిస్తోంది. ఇది కాశ్మీర్ టూరిజనానికి స్వర్ణయుగం లాంటిది అని పర్యాటకరంగ నిపుణులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ఆదాయానికి పర్యాటకమే ముఖ్య ఉపాధి వనరు. జనవరి 2022 నుంచి ఇప్పటి వరకు 1.62 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. ఇందులో ఈ ఏడాది నిర్వహించిన అమర్ నాథ్ యాత్రలో 3.65 లక్షల మంది పర్యాటకులు కూడా ఉన్నారు. కాశ్మీర్ లోని అందమైన లోయలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పహల్గామ్, గుల్మార్గ్, సోనామార్గ్, వంటి ప్రదేశాలతో పాటు శ్రీనగర్ లోని అన్ని హోటళ్లు, గెస్ట్ హౌజులు 100 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. పూంచ్ , రాజౌరి, జమ్మూ అన్ని ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో సినిమాల చిత్రీకరణ కోసం సమగ్ర ఫిల్మ్ పాలసీని ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరింతగా పర్యాటకులు వస్తారని అక్కడి అదికారులు అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment