భవిష్యత్తులో నేతలందరికీ అవకాశం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి 14 వరకుకొనసాగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఎవరు అన్నది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ భరితంగా కొనసాగింది. ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈనేపథ్యంలో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధి కోసం ప్రభాకర్ ను గెలిపించాలని కోరారు. టికెట్‌ ఆశించడం తప్పుకాదని, తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుందని కేసీఆర్ అన్నారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తామని అన్నారు. టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో కుసుకుంట్ల ప్రభాకర్ ను అధిక మెజార్టీ తో గెలిపించాలని కోరుతున్నామని తెలిపారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ బలోపేతం కోసమే అని అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. తను కేసీఆర్ నుంచి ఏమి ఆశించలేదని పేర్కొన్నారు. అందరిలాగా నేను టికెట్ ఆశించా! నాకు ఆహక్కు ఉందని తెలిపారు. కేసీఆర్ నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని అన్నారు. అయితే.. ఇవాళే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బిపార్మ్ ఇవ్వనున్న కేసీఆర్ తెలిపారని అన్నారు. సీఎం కేసీఆర్‌తో నర్సయ్య గౌడ్‌, కర్నె ప్రభాకర్ భేటీ అనంతరం సీఎం మాట్లాడుతూ.. మునుగోడు టీఆర్‌ఎస్‌ టికెట్​ బూర నర్సయ్య, కర్నె ప్రభాకర్​లు ఆశించారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయానికి అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. అయితే.. భవిష్యత్తులో జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో నేతలందరికీ అవకాశాలు ఉంటాయని హామీఇచ్చారు. ఈనేపథ్యంలో.. సీఎం వారికి సర్దిచెప్పడంతో, నర్సయ్య.. కర్నె ప్రభాకర్ కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)