ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి కొత్త యూనిఫాం !

Telugu Lo Computer
0


భారత వాయుసేన సిబ్బంది కొత్త యూనిఫాం వచ్చింది. 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆ యూనిఫాంను అధికారికంగా విడుదల చేశారు. గతంలో ఉన్న దానికి భిన్నంగా ఈ యూనిఫాం ఉంది. కొత్తగా ఉన్న యూనిఫాం చాలా వరకు ఆర్మీ యూనిఫాంను పోలి ఉండగా, దీనిని తేలికపాటి ఫ్యాబ్రిక్‌తో తయారు చేశారు. భారత వాయుసేన స్టాండింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్తంగా దీనిని రూపొందించాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా మైదానం, ఎడారి, పర్వత ప్రాంతాలు, అడవులు.. ఇలా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చి దిద్దారు. కొత్త యూనిఫాం కిట్‌లో కంబాట్ టీషర్ట్, ఫీల్డ్ స్కేల్ డిస్రప్టివ్ టోపీ, కంబాట్ టోనీ హ్యాట్, డిస్రప్టివ్ వెబ్ బెల్ట్, యాంక్లెట్ కంబాట్ షూ, మ్యాచింగ్ టర్బన్ ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)