ప్రేమ పేరుతో యువతిని చంపిన యువకుడు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కూరాడ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన గుబ్బ వెంకట సూర్యనారాయణ అనే యువకుడు చాలా కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. పలుమార్లు అతనిపై గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పెద్దలు అతడిని హెచ్చరించారు. అయినా గానీ తన వేధింపులు మాత్రం ఆపలేదు. ఎన్నిసార్లు ప్రేమించమని అడిగినా అంగీకరించకపోవడంతో ఈరోజు  ఉదయం కరప నుంచి తిరిగి తన స్వగ్రామానికి వస్తున్న ఆ యువతిని వెంబడించి ప్రేమను అంగీకరించాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో స్కూటీపై వెళుతున్న ఆమెను రోడ్డు మీద అడ్డగించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న బాధితురాలిని కాపాడేందుకు స్థానికులు కొందరు ప్రయత్నించారు. పోలీసులకు సమాచారం అందగానే 108 సహాయంతో కొన ఊపిరితో ఉన్న ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రాణాలు మాత్రం రక్షించలేకపోయారు. కాకినాడలోని జీజీహెచ్ కి తరలించే సరికి ఆమె ప్రాణాలు కోల్పోయిందని కాకినాడ డీఎస్పీ తెలిపారు.  కూరాడ వెళ్లే మార్గంలో ఈ దాడి జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆమె ప్రాణాలు రక్షించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో నిందితుడు వెంకట సూర్యనారాయణను పట్టుకుని చెట్టుకి కట్టేశారు. అతనిపై దాడికి యత్నించారు. పెదపూడి పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)