టిమ్‌ కుక్‌ దివాళీ శుభాకాంక్షల ట్విట్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 25 October 2022

టిమ్‌ కుక్‌ దివాళీ శుభాకాంక్షల ట్విట్ !


యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ ట్విట్టర్‌ వేదికగా హ్యాపీ దివాళీ అంటూ విష్‌ చేశారు. తన పోస్ట్‌తో పాటు భారత ఫోటోగ్రాఫర్‌ తీసిన ఫోటోను కుక్‌ షేర్‌ చేయగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపేక్ష మేకర్‌ ఫొటోగ్రాఫ్‌ను టిమ్‌ కుక్‌ షేర్‌ చేశారు. ఈ ఫొటోలో ఓ మహిళ రెండు చేతులతో ప్లేట్‌లో వెలుగుతున్న దీపాలను కవర్‌ చేస్తుండగా చుట్టూ పూవులతో అలంకరించడం కనిపిస్తుంది. దీపావళిని దివ్వెల పండుగ అని ఎందుకు అంటారో ఈ ఫోటో రమణీయంగా క్యాప్చర్‌ చేసిందని, అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ ఈ పోస్ట్‌కు టిమ్‌ కుక్‌ క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ పోస్ట్‌కు ఇప్పటివరకూ 47,000కు పైగా వ్యూస్‌ రాగా, పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. ఇన్‌క్రెడిబుల్‌ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా అద్భుతమని మరో యూజర్‌ రాసుకొచ్చారు.

No comments:

Post a Comment