టాపర్లకు హెలికాప్టర్‌ రైడ్‌ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 8 October 2022

టాపర్లకు హెలికాప్టర్‌ రైడ్‌ !


ఛత్తీస్‌గఢ్ లో 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. 'విద్యార్థులను మరింతలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. గగన విహారం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వారి లక్ష్యాలు మరింత ఉన్నత స్థాయిలో ఉండేందుకు ఈ రైడ్‌ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం' అని బఘేల్ గతంలో పేర్కొన్నారు. ఈ రైడ్‌ సందర్భంగా బఘేల్‌ తాజాగా మరోసారి స్పందించారు. 'చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన వారిని హెలికాప్టర్‌లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్‌ రైడ్‌ను ఆస్వాదిస్తారు' అంటూ సీఎం ట్వీట్‌ చేశారు.

No comments:

Post a Comment