తుఫానుగా మారనున్న అల్పపీడనం

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారనుండటంతో తమిళనాడు లోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. మద్రాసు హార్బర్‌, ఎన్నూరు, కాట్టుపల్లి, పుదుచ్చేరి, కడలూరు, నాగపట్నం, పాంబన్‌, తూత్తుకుడి ఓడరేవుల్లో ఈ సూచీలను ఎగురవేశారు. తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో నాగపట్టణం హార్బరులో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురు వేశారు. నాగపట్టణం జిల్లాకు చెందిన జాలర్లు సముద్రంలోకి చేపల పట్టేందుకు వెళ్ళొద్దని సూచించింది. గత నాలుగు రోజులుగా కడలూరు జిల్లాలో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కడలూరు, తూత్తుక్కుడి హార్బరుల్లో కూడా ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. చెన్నై వాతావణ కేంద్రం హెచ్చరిక నేపథ్యంలో పుదుచ్చేరి హార్బరులోనూ ఇదే విధంగా ప్రమాద హెచ్చరిక సూచీని ఎగురవేశారు. అలాగే, సముద్రంలో చేపల వేటకు వెళ్ళే జాలర్లరు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)