ప్రాణం కాపాడిన స్మార్ట్ వాచ్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 24 October 2022

ప్రాణం కాపాడిన స్మార్ట్ వాచ్ !అమెరికాలోని వాషింగ్టన్‌కి చెందిన యంగ్‌ సూక్‌ ఆన్‌ అనే 42 ఏళ్ల మహిళ తన భర్త చాయ్ క్యోంగ్‌తో గత కొంతకాలంగా గొడవపడతూ, ఇద్దరూ విడిపోవాలనుకున్నారు. అయితే విడిపోతే ఎక్కడ ఆమెకు భరణం ఇవ్వాల్సి వస్తుందో అని ఆలోచించిన ఆమె భర్త తనను చంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా పథకం ప్రకారం చాంగ్‌ క్యోంగ్‌ ఆమె ఇంటికి వచ్చి తనతో గొడవపడి తీవ్రంగా ఆమెను హింసించి టేప్‌తో  చుట్టి గ్యారెజ్‌ వద్దకు ఈడ్చుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను కార్‌వ్యాన్‌లో ఎక్కించుకుని ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవ సమాధి చేశాడు. అయితే ఈ క్రమంలోనే ఆమె తన చేతికి ఉన్న యాపిల్‌ వాచ్‌ సాయంతో తన 20 ఏళ్ల కూతురుకి మరియు అత్యవసర నెంబర్‌ 911కి కాల్‌ చేసింది. దానితో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వాషింగ్టన్‌లోని సీటెల్‌కు 60 మైళ్ల దూరంలో ఆమెను గుర్తించి రక్షించారు. కాగా ఆమె అప్పటికే తీవ్ర అస్వస్థకు గురై కొన ఊపిరితో కొట్టుకుంటోందని అధికారులు వెల్లడించారు. సమయానికి వాచ్ సూచన మేరకు అందరూ అప్రమత్తమవ్వడంతోనే యంగ్ సూక్ ను సురక్షితంగా రక్షించగలిగినట్లు పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment