బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోను

Telugu Lo Computer
0


బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని జేడీ(యూ) అధినేత.. బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ ప్రతిజ్ఞ చేశారు. సమస్తీపూర్ లో రూ.75 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభోత్సవంలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ..ఇక ఎప్పటికీ తమ పార్టీ బీజేపీతో పొత్తు పోట్టుకోబోదని తెలిపారు.సమాజ్ వాదీ (సోషలిస్టులు)లతో కలిసి కలిసి పని చేస్తుందని చెప్పారు. బీహార్‌లోని ప్రస్తుత మహాఘట్‌బంధన్ ప్రభుత్వంలో విభేదాలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించిన నితీశ్ కుమార్, బీహార్ తో పాటు దేశ ప్రగతికి కృష్టి చేస్తానని తెలిపారు. బీజేపీతో విడిపోయి బయటకు వచ్చి.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)తో జతకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి బీజేపీ తనను టార్గెట్ చేస్తోందని నితీశ్ అన్నారు. బీజేపీ కేవలం సమాజంలో వైరుధ్యం సృష్టించడానికే పనిచేస్తోందని..బీజేపీకి దేశ ప్రగతిపై ఏమాత్రం దృష్టి పెట్టటంలేదని అన్నారు. ప్రస్తుతం బీజేపీని వ్యతిరేకించినా..అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి బీజేపీ పితామహులను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు.ప్రస్తుతం బీజేపీ పార్టీకి ఎటువంటి విలువలు లేవని ప్రజల మధ్య విద్వేషాలు రేపి పబ్బం గడుపుకుంటోందన్నారు., కానీ పార్టీ ప్రస్తుత నాయకత్వం అహంకారంతో నిండి ఉందని అన్నారు. 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన నన్ను కేంద్ర మంత్రిని చేశారని ఆనాటి బీజేపీ నేతలు విలువలతో పనిచేశారని అన్నారు. నాకు మూడు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి దేశాభివృద్ధికి కృషి చేశారని అన్నారు.. నేటు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నేతలకు దేశాన్ని అభివృద్ధి చేయాలని ఏమాత్రం లేదని విమర్శించారు. బీజేపీకి అహంకారం తప్ప అభివృద్ధిపై దృష్టి లేదన్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)