అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ ముఫ్తీకి ఉత్తర్వులు

Telugu Lo Computer
0


మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని గుప్కార్‌ రోడ్డులోని అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయాలంటూ జమ్మూకశ్మీర్‌ పాలనా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ''కొన్ని రోజుల క్రితం నోటీసు అందింది. పెద్దగా ఆశ్చర్యపడలేదు. ప్రస్తుత యంత్రాంగం నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. నేను నివసిస్తున్న బంగళా ముఖ్యమంత్రి నివాసమని అధికారులు పేర్కొన్నారు. కానీ దీన్ని 2005లో మా నాన్న (ముఫ్తీ మహమ్మద్‌ సయ్యద్‌) ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత కేటాయించారు. కాబట్టి నాకిచ్చిన నోటీసు సరి కాదు. అయినా నాకు ఉండటానికి చోటేలేదు. ఎక్కడికి వెళ్లను. దీనిపై నిర్ణయం తీసుకొనే ముందు నా న్యాయ బృందంతో చర్చిస్తాను'' అని ముఫ్తీ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)