ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగించిన గుంటూరు కార్పోరేషన్

Telugu Lo Computer
0


గుంటూరు లోని మదర్ థెరీసా జంక్షన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణానంతరం స్ధానిక కళాదర్బార్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. ఇందుకోసం మున్సిపల్ అధికారుల్ని అనుమతి కోరినా రెండేళ్లుగా తిప్పడంతో చేసేది లేక కళాదర్బార్ ఈ విగ్రహం ఏర్పాటు చేసింది. దీంతో అధికారులు ఆగ్రహంతో దాన్ని తొలగించారు. ఈ వ్యవహారం స్ధానికంగా కలకలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన తొలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా ఇదే. దీన్ని కూడా అధికారులు నిబంధనల పేరుతో తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు కోసం అనుమతి కోరుతూ గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, అనుమతి కోసం రెండేళ్లుగా తిరుగుతున్నామని, కానీ వారు కనికరించలేదని కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు తెలిపారు. ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేసుకుంటే కార్పోరేషన్ అధికారులు అక్రమమంటూ తొలగించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత గాయకుడికి గుంటూరు కార్పోరేషన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. గుంటూరులోనే అనుమతి లేకుండా దాదాపు 200 విగ్రహాలు రోడ్లపై ఉన్నాయని, అయినా వాటికి అడ్డురాని నిబంధనలు, ఒక్క ఎస్పీ బాలు విషయంలోనే అడ్డొచ్చాయా అని కళాకారులు మండిపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)