పన్నా గనుల్లో 9.64 క్యారెట్ల వజ్రం లభ్యం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రాణా ప్రతాప్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని భర్కా గని ప్రాంతంలో ఓ గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ ఆరు నెలలుగా తవ్వకాలు జరుపుతున్నాడు. చివరికి అతడి కష్టం ఫలించింది. దసరా  రోజున సదరు వ్యక్తికి 9.64 క్యారెట్లు విలువ చేసే వజ్రం ఒకటి దొరికింది. దాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్‌లో డిపాజిట్ చేశాడు. రానున్న ఆక్షన్‌లో ఈ వజ్రాన్ని ఉంచనున్నట్లు రాణా ప్రతాప్ తెలిపాడు. ఈ డైమండ్ విలువ సుమారు రూ. 40 లక్షలు ఉంటుందని అంచనా. ఇంతటి విలువైన వజ్రం దొరకడంతో రాణా ప్రతాప్ కుటుంబం ఆనందంలో మునిగి తేలుతున్నారు. కాగా, వేలంలో వచ్చిన కొంత డబ్బును పేద పిల్లల సహాయార్ధం ఖర్చు పెడతానని రాణా ప్రతాప్ పేర్కొన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)