నాగేశ్వరరావు కేసులో 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు

Telugu Lo Computer
0


పోలీసు సర్వీసు నుండి డిస్మిస్ అయిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో రాచకొండ పోలీసులు కోర్టులో 600 పేజీల చార్జీ షీట్ దాఖలు చేశారు. వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో నాగేశ్వరరావును రెండు రోజుల క్రితమే సర్వీస్ నుండి తొలగిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రెండు నెలల పాటు జైల్లో వుండి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు. ఛార్జ్ షీట్ లోనూ అన్ని అంశాలు పోలీసులు పొందపరిచారు. సీసీ ఫుటేజ్ వివరాలు, డిఎన్ ఏ రిపోర్ట్ లు, యాక్సిడెంట్ అయ్యిన వివరాలు, వెపన్ దుర్వినియోగం వివరాలు, బాధితురాలి స్టేట్ మెంట్ లను ఛార్జ్ షీట్‌లో పోలీసులు వివరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)