రూ.1,476 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర నవీ ముంబయిలో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఆరెంజ్ పండ్ల బాక్సుల్లో దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న 198 కిలోల హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్ (ఐస్), 9 కిలోల హై ప్యూరిటీ కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1,476 కోట్లు ఉంటుందని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు పట్టుకున్న యాంఫెటమైన్, కొకైన్‌లలో ఇదే పెద్ద మొత్తమని తెలిపారు. ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. గత 12 రోజులుగా తనిఖీలు చేపట్టారు అధికారులు. సెప్టెంబర్​ 12న తనిఖీలు చేస్తున్న సమయంలో పండ్ల ట్రక్కులో డ్రగ్స్​ను గుర్తించారు. పండ్ల డబ్బాల్లో డ్రగ్స్​ను దాచిపెట్టి కొత్త విధానంలో రవాణా చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇవి దక్షిణాఫ్రికా నుంచి వచ్చాయని.. దిగుమతిదారుడిని పట్టుకున్నామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. అక్రమ రవాణా సూత్రధారుల్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.


Post a Comment

0Comments

Post a Comment (0)