ధర పడిపోయిన నిమ్మకాయలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఏడాది పొడవున పంట ఉండటంతో నిమ్మతోటలను పాడికుండగా పలువురు అభివ ర్ణిస్తుంటారు. ప్రస్తుతం నిమ్మ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రతి ఏటా మార్చి నెల నుంచి మే నెల వరకు వేసవి కారణంగా ఈ పంటకు మంచి డిమాండ్‌ ఉంటుంది. సి విటమిన్‌ ఎక్కువగా ఉండ డంతో వినియోగదారులు నిమ్మను ఎక్కువగా వినియో గిస్తుంటారు. సిట్రిక్‌ యాసిడ్‌తో పాటు తదితర సుగు ణాలు ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. ఇటువంటి నిమ్మను పండించే రైతులకు మాత్రం గత కొంత కాలం గా మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది వేసవిలో కిలో నిమ్మకా యల ధర రూ.160 వరకు పలికింది. అప్పట్లో కాయలు లేక రైతులు చెట్టు వైపు కాయల కోసం ఎగాదిగా చూసేవారు. చిన్నసైజు కాయలను కూడా వదలకుండా ధర పై ఉన్న మక్కువతో మార్కెట్‌కు తరలించేవారు. ప్రస్తుతం చెట్ల నిండా కాయలు ఉన్నా మార్కెట్‌లో కిలో నిమ్మధర రూ.8 నుంచి రూ.10లు మాత్రమే పలుకు తోంది. దీంతో కోత ఖర్చులు కూడా రావని రైతాంగం అంటున్నారు. పెద్ద నిమ్మకాయలు కిలోకు 12 నుంచి 15.. చిన్న నిమ్మ కాయలు అయితే 20 వస్తాయి. ధర తక్కువగా ఉండడంతో కాయలు కొయ్యకుండా వది లేద్దామంటే చెట్టుకు భారమై అవి కుళ్ళిపోవడం ద్వారా చెట్లకు వైరస్‌ సోకుతుందని కొందరు రైతులు చెబుతున్నారు. ఈ నేపద్యంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఏమిచేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. పక్వానికి వచ్చిన కాయలు కోయడానికి వీలు లేక చెట్లుకే పండిపోయి రాలిపోతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)